జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందజేసిన పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఈ సందర్భంగా, మాట్లాడుతూ దేవాలయ నిర్మాణానికి తనను కూడా భాగస్వామి చేసినందుకు జిన్నారం గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడు అమ్మవారి కృపా కటాక్షం అందరిపై ఉండాలని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి అన్నారు.
గుడి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఈ సందర్భంగా
మెట్టు కుమార్ యాదవ్ ను కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాజకీయనాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

