నేటి సాక్షి నారాయణపేట జూన్ 20,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ప్రధాన రహదారి అయిన రాయచూర్ నుండి హైదరాబాద్ కి వెళ్లే రహదారిలో మరికల్ ఎస్బిహెచ్ బ్యాంకు ముందు ఉన్న డివైడర్ రేకులు రోడ్డుపై ప్రమాదకరంగా మారాయని వాహనదారులు వాపోతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే డివైడర్ల రేకులు చెల్లాచెదారకరంగా మారి ప్రమాదకరంగా మారుతున్నాయని వాహనాదారులు అధికారుల పనితీరుపై విమర్శిస్తున్నారు. ఇకనైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న డివైడర్లను సరిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.

