ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులర్పించిన. బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్. నేటి సాక్షి,నర్సంపేట,జూన్ 21: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా శనివారం నాడు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్. బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి మన ప్రాంతానికి జరుగుతున్న అన్యా యాన్ని వెలుగెత్తి చాటి, ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి చుక్కాణిగా ఉంటూ తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మేధావి.మలిదశ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసిఆర్ తో కలిసి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర నలుమూలల గ్రామ గ్రామాన ఉద్యమ ఆకాంక్షను తెలిపేలా చేశారని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ, ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు రాయకుల సారంగం, పెండ్యాల యాదగిరి, అప్పాల సుదర్శన్,మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్, దేఓజు సదానందం, వాసం సాంబయ్య, మహబూబ్ బాషా, గందె చంద్రమౌళి, పెండెం వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, వార్డు అధ్యక్షులు నాగిరెడ్డి రవి, సాలన్న, పార్టీ నాయకులు మంద ప్రసాద్, దొమ్మటి సంతోష్, బగ్గీ రాజు దేవోజు హేమంత్, నల్ల రవీందర్, కాలే రాజు, ఇతర నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

