నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 21, ప్రతి ఒక్కరూ యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉంటారని యోగాన్ని పునులు సుదర్శన్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మరికల్ మండల కేంద్రంలోని రిషి హైస్కూల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగా నిపుణులు సుదర్శన్ శివ ప్రసాదులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రిషి పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటేష్, కురుమూర్తి, బాలరాజు, నరేందర్, ఆంజనేయులు, లావణ్య,శ్రావణి,ఆశ తదితరులు పాల్గొన్నారు.

