- జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి..
పచ్చిగడ్డి వితరణ చేసిన పలువురు దాతలు…
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన కోడెలకు దాతలు పచ్చిగడ్డి వితరణ చేసేందుకు ముందుకురావాలని జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. కోడెలకు దాతలు పచ్చిగడ్డి వితరణ
చేసి రాజన్న సేవలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు.
చందుర్తి మండలం లింగంపేటకు చెందిన పెగ్గర్ల రమేష్ రావు రైతు ఆధ్వర్యంలో ఏనుగుల అనిల్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు దాదాపు 1500 కిలోల పచ్చి గడ్డి పంపించారని తెలిపారు. ఇప్పటిదాకా 7500 కిలోల గడ్డిని వితరణ చేశారని వివరించారు.
వితరణ చేసిన వారిలో రాజన్న భక్తులు రైతు బిడ్డలు చందరశేఖర్ రావు, రామరావు, బోడపట్ల జలేందర్, ఈగ ప్రవీణ్, మనోహర్ ఉన్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారిని అభినందించారు. గ్రామాలలో ఎవరి వద్ద అయినా మిగులు గడ్డి ఉంటే స్వామి వారి కోడెలకు ఇవ్వాలని జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి కోరారు.

