ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి
నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 21,
రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు.
శనివారం నారాయణపేట మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలంలో ఇండ్ల నిర్మాణం సంబంధించిన భూమి పూజ, ముగ్గు వెయడం కార్యక్ర మంలో పాల్గొని భూమి పూజ నిర్వహించారు. అప్పిరెడ్డిపల్లి గ్రామానికి మొదటి విడతలో 28 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందనీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంద న్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ తెలంగా ణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తూ ఈ రైతాంగాన్ని ఆదుకోనాలని ఉద్దేశంతో ప్రతి ఒక వ్యవసాయం చేసే ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేయండం జరిగిందన్నారు ఈరోజు వరకు వరకు పది ఎకరాల వరకు రైతుబంధు వాళ్ల వాళ్ల ఖాతాలో జమ చేయడం జరిగిందనీ తెలిపారు. సోమవారం మిగతా రైతులకు మొత్తం రైతు భరోసా నిధులు అందరి అకౌంట్లో జామ కావడం జరుగుతుందని చెప్పారు. ఇందిరమ్మ పాల నలో రేవంత్ రెడ్డి నాయక త్వంలో మహిళలకు ఉచి తంగా బస్సు , ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నడని అన్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలని ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ అవకాశం వినియొగించుకొవాలనీ ప్రజలను కోరారు. మీకు ఏ అవసరం వచ్చినా సమాచా రం అందించండి నేరుగా మీ దగ్గరకు వచ్చి కలిసిన మీ అవసరం తీరుస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసు దన్ రెడ్డి , ,ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మాధవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోవ ర్ధన్ రెడ్డి, టి మాధవ్, ఎ హనుమంతు, మేకలి నాగప్ప, పి వెంకటరెడ్డి, జి శ్రీనివాస్ రెడ్డి, బీమానికప్ప, రాము, కురువ గుండప్ప, కురువ మల్లేష్ ,కురువ రాజు, ఈ కనకప్ప, జి గంగప్ప, తిరుమలయ్య, బి కాశీనాథ్ బి రాము మేకలి నర్సింలు,తదితరులు పాల్గొన్నారు.

