గన్నేరువరం బిజెపి మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్
నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో శనివారం రోజున గన్నేరువరం మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు.
భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన అపురూప కానుక యోగ
యోగ ద్వారా మనస్సు శరీరాన్ని ఏకం చేస్తుందని. శారీరక దృఢత్వాన్ని, మానసిక శాంతిని ఆత్మశుద్ధిని చేస్తుందని,యోగ అనేక రుగ్మతలను తొలగిస్తుందని, యోగాను ప్రతిరోజు కార్యక్రమం లాగానే అలవర్చుకోవాలని తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ యోగాను విశ్వవ్యాప్తం చేసి నేడు దాదాపు 190 పైగా ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి అన్నారు. చైనా అమెరికా జపాన్ వంటి దేశాలు తమ పాఠశాలల్లో యోగాను ప్రవేశపెట్టాయన్నారు.
వన్ ఎర్త్ వన్ హెల్త్,ప్రపంచ శాంతిని ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది భారతదేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎలేటి చంద్ర రెడ్డి,విలాసాగరం రామచంద్రం,ఆరికతం,అనిల్ రెడ్డి, పుల్లేల రాము, బండి తిరుపతి, గీకురు అంజయ్య, అటికేం రమేష్, గoట గౌతం,కాట్నపల్లి అజయ్,బద్దం శివారెడ్డి ,బత్తుల సతీష్, ప్రశాంత్,బూర రామక్రిష్ణ, యువశక్తి యూత్ సభ్యులు శివ సాయి,గణేష్, సాగర్, అజయ్, యూత్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

