నారాయణపేట జిల్లా పోలీస్
తేది:23.06.2025
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
పేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్
సాక్షి,నారాయణపేట జూన్ 23,
అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మిషన్ పరివర్తన, నష ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా వికలాంగులు మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… జిల్లాలో వారం రోజుల వరకు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని ఎస్పీ గారు కోరారు. అలాగే జిల్లా పరిధిలో ఎక్కడైనా డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించిన, అమ్మిన, సరఫరా చేసిన వెంటనే అట్టి వ్యక్తుల సమాచారం సంబంధిత లోకల్ పోలీసులకు ఇవ్వాలని లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరసింహ,
లు ఇందిర, మద్దయ్య, సాయి, వాలంటీర్లు లక్ష్మీకాంత్, సంధ్య, పోలీసు సిబంది పాల్గొనడం జరిగింది.

