—- కాంగ్రెస్ పార్టీలో నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన రాఘవేందర్ రెడ్డి
—- కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు సమత ప్రకాష్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సమతా ప్రకాష్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మహేశ్వరం గడ్డపై. పేదింటివాడి కళ నిజం కావాలని ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి ఇల్లు నిర్మించాలని ఒక దృడ సంకల్పంతో ముందుకెళ్లడం జరుగుతుంది అలాగే దేశంలోనే ఎక్కడలేని విధంగా ప్రభుత్వం రేషన్ షాపులలో పేదలకు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది మరియు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ని సరఫరా చేయడం జరుగుతుంది ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఇన్ని మంచి పథకాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నుండి రాఘవేందర్ రెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి ఆధ్వర్యంలో.. తన అనుచరులతో టిఆర్ఎస్ కండువా కప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం పై మహిళా అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటుంది కానీ ఇక్కడ అక్రమాలకు దౌర్జన్యాలకు ఎటువంటి స్థానం ఉండదని తెలుసుకున్న మర్యాద రాఘవేందర్ రెడ్డి ఎక్కడైతే కేరాఫ్ అడ్రస్ గా.. అక్రమాలకు అడ్డగా.. చెప్పుకుంటారో.. ఆ పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటు అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తప్పు దోహా పట్టించడం కోసమే.. ఈ యొక్క ప్రయత్నాలు చేసినట్లుగా.. తెలియజేస్తూ తగిన బుద్ధి ప్రజలే చెప్తారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సమత ప్రకాష్ తెలియజేశారు

