నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి మరియు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మరియు రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ఆదేశాల మేరకు లక్ష్యం కోసం లక్ష చెట్లు కార్యక్రమంలో భాగంగా నంది హిల్స్ మరియు జిల్లెల గుడా లో నిర్వహించినటువంటి దేశీయ చెట్ల మొక్కలను నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు హాజరై శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా మోర్చా నాయకురాలు, వివిధ మోర్చాల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు మరియు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

