అగ్రవర్ణాల బడులు, చదువుకునే పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు.
- చదువుకు, ఓటుకున్న సంబంధం.
- కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులను చదువుల కోసం అగ్రవర్ణాల బడుల్లో పెడుతున్నాం.
- ప్రభుత్వం బడులను బలహీనపరిచింది ఈ ప్రైవేటు విద్యాసంస్థలే.
- వేల ఏండ్లుగా కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం, విద్యాసంస్థలను నెలకొల్పింది భారతదేశంలో అగ్రవర్ణాల వారే, డబ్బు పెట్టి చదువుకునేది మన ప్రజలు.
- కార్పొరేట్ వ్యవస్థకు దాసోహం అంటున్న ప్రభుత్వాలు.
- మరి ఎప్పుడు చూస్తాము మార్పు ?
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
చదువు పేదవాడిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని చెప్పడానికి ఉదాహరణ ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరొకరు అబ్దుల్ కలాం, మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇలా తెలిసి తెలియకుండా ఎంతో మంది మోహినిలు మన మధ్యలో వచ్చారు వెళ్లి వారి జీవితం అంటరాని తనం మధ్య కటిక పేదరికం మధ్య జరిగింది. ప్రతి ఒక్కరూ కడుపు మార్చుకుని చదువును ప్రేమించి చదివే తమ జీవితంగా బతికారు అందుకే ఆ స్థాయి వరకు ఎదిగారు చదువు నేటి సమాజంలో అత్య వసరమైనది నిన్నటి మన జీవితం ఎలా ఉన్నప్పటికీ రేపటి భవిష్యత్తు చదువుతో మార్పులు నాంది పలుకుతుంది.
అలాంటి చదువు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థల చేతిలోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్న ప్రభుత్వాలను చూసి సిగ్గుపడాల్సిన అవసరం, ప్రజలు ప్రజాస్వామ్య వాదులు కమ్యూనిస్టులు లెఫ్ట్ లు రైట్లు అందరూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం అని ఉద్యమాలు చేస్తున్న వాళ్లు సైతం, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో మరీ ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో మిగిలిన పేద వారులను మాత్రం గవర్నమెంట్ బడుల్లో చదువుకోమని ఉపదేశాలు చేస్తున్నారు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ, అత్యాధునికమైన చదువులతోటి వారిలో నైపుణ్యాలు పెంచుతూ వారి పిల్లల్ని విదేశాల వైపు పంపే ఆలోచనలో వారు ఉంటే మనం మన పిల్లలు కనీసం పదో తరగతి ఇంటర్ పాసై ఏ చిన్న ఉద్యోగమైన చేసుకొని బతకగలుగుతారని ఆలోచనలో మనం ఉంటున్నాం. ఇక ప్రభుత్వ పాఠశాలలను బలహీన పరుస్తున్నది ఎవరు అంటే కార్పొరేట్ వ్యవస్థ ఏ కార్పొరేట్ వ్యవస్థ అయితే వేల రూపాయలను మన దగ్గర నుండి దోచుకుంటుందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను తమ విద్యార్థులుగా చేర్చుకొని వారు కట్టే ఫీజులతో అంతస్తులను వేల కోట్ల వ్యాపారాలను చేస్తూ ఈ సమాజంలో పెద్దలుగా చలామణి అవుతూ రాజకీయాలతో ముడిపడి ఆ రాజకీయ నాయకులతో ఈ పాఠశాలలను బలహీన పరుస్తున్నారు. దీనికి ఉదాహరణగా శ్రీమంతుడు అనే సినిమాలో హీరోతో ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరుని బాగు చేయడానికి చేసే ప్రయత్నంలో పాఠశాలలను కట్టేందుకు ప్రయత్నం చేస్తుంటాడు ఆ సినిమాలో ఉన్న విలన్ తమకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే నీకు చదువు రాదని డబ్బులు కట్టి మా పాఠశాలలో చేర్చుకోమని ఉచిత సలహాలు ఇస్తాడు ఇదే నేటి సమాజంలో జరుగుతున్నది. ఈ రోజు రాజకీయాలను శాసిస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలో భాగస్వాములై ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను కాలేజీలను నిర్వీర్యం చేస్తే ప్రయత్నంలో ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ వైపు మారుస్తున్నాయి ఈ దేశ ప్రభుత్వాలు దానికి అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రైవేటైజేషన్ ని ప్రోత్సహిస్తున్నాయి ఇదే కొనసాగితే మధ్య తరగతి పేదవాడు చదువుకు దూరంగా వలసిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తమను చదువుకునే స్థితి నుండి మళ్లీ బానిసత్వం వైపు నెట్ వేయబడతారు రోజు రోజు పెరుగుతున్న ధరలను చూస్తే చదువుని కొనుక్కొని చదువుకునే స్థితికి వచ్చామనేది అర్థం అవుతుంది ఈ వ్యవస్థను మార్చాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. మరీ ముఖ్యంగా ప్రజా స్వామ్యవాదులు పూలే అంబేద్కర్ వారసులు విద్యా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని అంతర్గత శుద్ధితో నిర్వహిస్తూ తమ వృత్తికి న్యాయం చేస్తే కచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభుత్వం పాఠశాలలు బలోపేతం అవుతాయి ఢిల్లీలో కేజీలు వాళ్ళ లాంటి నాయకుడు ఒక ప్రయోగం చేసి కార్పొరేట్ వ్యవస్థ లాంటి భవనాలు విద్యా వ్యవస్థను ప్రైవేట్ స్థాయిలో కాకుండా ప్రభుత్వ స్థాయిలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు అలాగే మిగిలిన రాష్ట్రాలు కూడా చేస్తే ఈ దేశం పేద మధ్య తరగతి నుండి వేలాది మంది అంబేద్కర్లను, అబ్దుల్ కలాం లను ఎంతో మందిని తీర్చిదిద్దే అవకాశం ఉందని మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
తాడిశెట్టి క్రాంతి కుమార్
తెలంగాణ జిల్లాల ఫూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్

