Thursday, January 22, 2026

రాయికల్ పట్టణ అభివృద్దికి రూ.15 కోట్లుప్రణాళిక ప్రకారం నిధుల వినియోగంజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్


నేటిసాక్షి, రాయికల్ :
తెలంగాణా సర్కార్ రాయికల్ పట్టణ అభివృద్దికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ఇట్టి నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. రాయికల్ పట్టణంలో మంగళవారం ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో కాలి నడకన కలియతిరిగి ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం గుడేటి రెడ్డి సంఘ భవనంలో మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.19 లక్షల 60 వేలు సాయం చెక్కులను, 71 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.71 లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను రాయికల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తనన్నారు. రాయికల్ పట్టణానికి రూ.15కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, రాయికల్ పట్టణ ప్రజల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత బకాయిలు రూ. 3కోట్లు మంజూరు చేయించానని, నూతనంగా మరో రూ.3కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ.15కోట్ల నిధులకు పట్టణంలో పనులకు అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచనలు చేసారు. రాయికల్ మండల పరిధిలోని ఒక్కో గ్రామానికి దాదాపు రూ.20 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసామని వాటితో పలు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపిడిఓ చిరంజీవి, ఎఇ ప్రసాద్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గన్నె రాజిరెడ్డి, రవీందర్ రావు, పడిగేల రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్, అనుపురం శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 24RKL01: కాలనీల్లో కాలినడకన కలియ తిరుగుతున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తదితరులు
24RKL01A: కళ్యాణి లక్ష్మి సాయం చెక్కులను పంపిణీ చేస్తున్న దృశ్యం
24RKL01B: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News