నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)
- కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్
❇️ కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సమావేశంలో విద్యార్థుల స్కూల్, కాలేజ్ కి సమయానికి వెళ్లేలా అధికారులు వారికీ బస్ సౌకర్యం కల్పించాలని, పక్క ప్రణాళికతో ఉండి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, కల్లూరు మోడల్ స్కూల్ కి అదనపు బస్సులు కేటాయించాలని,
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోకి బస్సులు కావాలని, మరిన్ని రిక్వెస్ట్ స్టాప్ లు కావాలని,పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో ఆర్.ఏం రాజు,డివిఏం భూపతి రెడ్డి, కోరుట్ల డీఎం మరియు ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

