కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలి. నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్రాయచోటి టౌన్ మిట్టవా oడ్లపల్లి కి చెందిన సృజన ఆత్మహత్య కు గల కారణాలు పోలీస్ లు వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం నాయకులు సృజన తల్లిదండ్రులను,కుటుంబ సభ్యులను పరామర్శించి సృజన ఆత్మహత్య కు గల కారణాలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఉత్తప్ప కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలను మీడియాకి వివరించారు.ఈ సందర్బంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉత్తప్ప, తారకరత్న రెండు కుటుంబాలు మిట్టవాండ్ల పల్లి లో నివాసం ఉండే దూరపు బందువులని తెలిపారు. వీరి మధ్య రెండు సంవత్సరాల ముందు చిన్న తాగా దాలు ఉంటే తారకరత్న దారి కాచి ఉత్తప్ప ను కొట్టాడని, అక్కడున్న స్థానికులు అడ్డుకోవడం తో ఉత్తప్ప కు తారకరత్న నుండి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తారకరత్న మీద బైoడొవర్ కేసు చేశారన్నారు.తారక రత్న పేరుకు ఇంజినీరింగ్ చదివినా అలవాట్లు మరియు కొంతమంది అల్లరిమూకల్తో తిరిగేవాడని వాళ్ల పెద్దమ్మ తో కూడా ఘర్షణలు జరిగాయని తమ విచారణ లో వెల్లడి అయిందన్నారు. అయితే రెండు సంవత్సరాలనుండి అప్పటి ఘటన మనసులో పెట్టుకున్న తారకరత్న సృజన ఆత్మహత్యకు రెండు రోజుల ముందు కూడా ఉతప్ప మీద అటాక్ చేసి భయబ్రాంతులకు గురించేసి అటు ఉతప్ప ను ఆమె కుమార్తె సృజన ను బయపెట్టినట్లు బాధితులు తెలిపారు. కొంతమంది సృజనకు ఫోన్ చేసి మీ నాన్న కత తేలు స్తామని బెదిరించిన విషయాన్ని స్వయంగా ఉతప్ప వెల్లడించారని ఇటీ వల పది పాస్ అయిన సృజన డాక్టర్ కావాలనుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. సున్నితమనుస్కురాలు అయిన భయబ్రాంతులకు లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు బావిస్తున్నామని అయితే ఫోన్ కాల్ ఆధారంగా మరింత విచారణ చేసి సృజన ఆత్మహత్యకు కారణాలు వెల్లడించాలని తెలిపారు.సృజన మరణoతో తారకరత్న మీద కేసు పెట్టిన కారణంగా జైలు నుండి వచ్చిన తర్వాత ఉతప్ప కుటుంబాన్ని లేకుండా చేస్తానని తారకరత్న చెప్పినట్లు ప్రచార o జరుగుతోందని ఒక వైపు బిడ్డను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి వచ్చే బెదిరింపుల నివారించి వారికి పోలీసులు అండగా నిలబడాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఉతప్ప కుటుంబసభ్యులతో పాటు సిపిఎం నాయకులు రామాంజులు రామచంద్ర లు పాల్గొన్నారు