సెప్టెంబర్ 28న పార్వతీపురంలో సదస్సు
సభ్యత్వం, కొత్త క్లబ్బుల ఏర్పాటుకు కృషి
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి,
వాకర్స్ ఇంటర్నేషనల్ 163వ కౌన్సిల్ మీట్ ఆదివారం తిరుపతిలో ఘనంగా జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ప్రభావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సభ్యత్వం నూతనంగా క్లబ్బుల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఎలక్ట్ గవర్నర్స్ ఈ కార్యక్రమంలో హాజరై ప్రసంగించారు. ఎలెక్ట్ గవర్నర్ డాక్టర్ పాతపాటి రవిరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్థాయిలో కౌన్సిల్ మీట్ ను సెప్టెంబర్ నెల 28వ తేదీ ఆదివారం పార్వతీపురంలో నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు. 163వ కౌన్సిల్ మీట్ పవిత్ర పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో జరగడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవి రాజు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం వైజాగ్ లో ఆల్వార్ దాస్ ఆధ్వర్యంలో పదిమంది సభ్యులతో ఏర్పడిన వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ నేడు అయిదు లక్షల మంది సభ్యులు కలిగి ఉన్నారన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను పది లక్షలకు చేర్చి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. పాస్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ రామానందం మాట్లాడుతూ నూతనంగా ఎలక్టయినా గవర్నర్లకు విధివిధానాలను వివరించి ప్రతి మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ శర్మ మాట్లాడుతూ సభ్యత్వ సంఖ్యను పెంచి క్లబ్బులను నూతనంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన ప్రముఖ వాకర్స్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి, డాక్టర్ రవి రాజు, డాక్టర్ రమానందం, డాక్టర్ శర్మ, సీతారామయ్య, కృష్ణకుమారి, సుబ్బారెడ్డి, నాగభూషణం, ఐజాక్, డాక్టర్ విజయలక్ష్మి,కోనేటి రవిరాజు, మాధవ నాయుడు, అమర్నాథ్, శ్రీ వినాయక సాగర వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివారెడ్డి, ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, చేజర్ల సుబ్రహ్మణ్యం రాజు, శరత్ కుమార్ రాజు, పేరూరు సుధాకర్ రెడ్డి, కృష్ణారావు,గోపి, చల్ల ముని కృష్ణయ్య,ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, రావు కృష్ణారావు, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు.