నేటి సాక్షి, నారాయణపేట, జూలై 3,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షానికి పాఠశాలలో ఏర్పడిన పలు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. మరికల్ మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, కాంగ్రెస్ పార్టీ మరికల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, చెన్నయ్య, రాఘవేంద్ర, రామకృష్ణారెడ్డి, గోవర్ధన్, పి. రామకృష్ణ, జంగిడి రఘు, పసుపుల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.