రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రిగారి సతీమణి వాకిటి లలిత….
నేటి సాక్షి,నారాయణపేట, జూలై 3,
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని పరామర్శించి,వారిని స్వయంగా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించేటటువంటి మంచి మనసు కలిగిన వ్యక్తిగా మన మక్తల్ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌ” శ్రీ డా” వాకిటి శ్రీహరి గారీ సేవా గుణం మనందరికీ తెలిసినదే.
అందులో భాగంగానే నేడు మాగనూరు మండల కేంద్రంలో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి మక్తల్ కు వస్తుండగా చందాపూర్ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి గాయపడిన వారిని స్వయంగా ఆసుపత్రికి తీసుకువెళ్లి దగ్గరుండి చికిత్స చేయించిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు మరియు యువజనుల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సతీమణి శ్రీమతి లలితమ్మ,
అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స వైద్యం అందించాలని దగ్గరుండి వారిని చూసుకోవాలని డాక్టర్లను కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో మంత్రి గారి సతీమణి శ్రీమతి వాకిటి లలిత గారి విందులు మక్తల్ పట్టణ అధ్యక్షులు రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజా శివ హేమ సుందర్ నాగరాజ్ రాజు తదితరులు పాల్గొన్నారు.





