Sunday, March 15, 2026

సోషల్ మీడియాలో ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు

పేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్

నేటి సాక్షి,నారాయణపేట, జులై 3,

నారాయణపేట జిల్లా పరిధిలో ఒక మతాన్ని ఇంకో మతం వారు కించపరుస్తూ సోషల్ మీడియాలో (సామాజిక మాధ్యమాల్లో) పోస్టులు చేస్తే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలిపారు.

గురువారం ఉదయం నారాయణపేట జిల్లా పరిధిలో 2023 సంవత్సరం నుండి 2025 వరకు పలు సామాజిక మధ్యమాల్లో (ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్) లలో ఇతర మతాలను కించపరుస్తూ సుమారు 20 పైగా పోస్టులు చేసిన యువకులకు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిధిలో సోషల్ మీడియాలో ఒకరి మతాన్ని ఇంకొకరు ద్వేషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల మత ఘర్షణలకు దారితీస్తుందని అలాంటి సెన్సిటివ్ విషయాలను సహించేది లేదని అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపించడం జరుగుతదని హెచ్చరించారు. ఇకపై ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయరాదని యువకులకు సూచించారు. కొంతమంది అనుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను గమనించకుండా వెంటనే ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని అనుకోకుండా వారి సోషల్ మీడియా కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఇక పై సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇతరులకు షేర్ చేయాలని తెలిపారు. సోషల్ మీడియాని పోలీసులు నిరంతరం 247 పరిశీలిస్తుంటారని, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎస్పి నల్లపు లింగయ్య, నరేష్, రాముడు, భాగ్యలక్ష్మి రెడ్డి, రాము, బాలరాజు, విజయ్ కుమార్, కేసులు నమోదైన యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News