నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్యగౌడ్):
గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మడేలేశ్వర ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి 11.వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అనంతరం గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో అల్లూరి శ్రీనాథ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వరుకోలు వెంకట్, బుర్ర కనకయ్య, మాజీ ఎంపీటీసీ అటికెం రాజేశం గౌడ్, రజక సంఘం అధ్యక్షుడు సమ్మయ్య, సంతు హనుమాన్ల శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.





