నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండలంలోని పారువేల్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బాలాజీ నగర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు 250. నోటుబుక్స్ 55.స్కూల్ బ్యాగ్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉండాలని అవసరం ఉన్నచోట అవసరం ఉన్నవారికి సేవ చేయడంలో ముందుండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జెడ్ సి బద్దం మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు వి. విజయపాల్ రెడ్డి, ఇఫ్తే కార్ ఆలీ, కిషన్ రెడ్డి,శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.





