Sunday, March 15, 2026

మండలం లో మొట్టమొదటి మహిళా మత్స్య కార్మిక కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల పరిధిలోని గునుకుల కొండాపూర్ లో ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు గూడెల్లి మల్లేశం ముదిరాజ్ ఆద్వర్యంలో గన్నేరువరం మండలంలో మొట్టమొదటి మహిళా మత్స్య కార్మిక ‌సంఘం ఏర్పాటు చేశారు. అన్ని రంగాలలో మహిళలు దూసుకు వస్తున్నటువంటి తరుణంలో మత్స్య కార వృత్తి లో కూడా వారిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ముదిరాజ్ మహిళా మత్స్యకార కోపరేటివ్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ (k687)ని ఏర్పాటు చేసుకున్నారు. ఈసందర్భంగా
మహిళలు మాట్లాడుతూ త్వరితగతిన సొసైటీ ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ డిఎఫ్ఓ విజయభారతి గారు మరియు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎఫ్ డి ఓ మంజుల ను శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళ సొసైటీ కి సహయ సహాకారాలు అందించాలని కోరారు.
అలాగే మహిళా సొసైటీ కి సహాయ సహకారాన్ని అందించిన జిల్లా ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ కు మరియు వైస్ చైర్మన్ పెసర కుమారస్వామి ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News