నేటి సాక్షి, దేవరకద్ర జులై 8
దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులో మంగళవారం నీటి నిల్వ స్థోమత 22.6 ఫీట్లకు చేరింది. గత కొన్ని రోజులుగా జూరాల నుండి కృష్ణా జలాలను కోయిల్ సాగర్ కు తరలిస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమేపి పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ స్థోమత 32.5 ఫీట్లు. ప్రాజెక్టులోకి కృష్ణా జలాలు తరలిస్తుండటంతతో కోయిల్ సాగర్ కు జలకళ వచ్చింది. దీంతో వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు కోయిల్ సాగర్ ను చూడడానికి ప్రాజెక్టు వద్దకు తరలివస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటితో కలకళలాడుతుంది.