నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చంద్ర రెడ్డి నగర్ కాలనీ, సాయి కృష్ణ కాలనీ, టీచర్స్ కాలనీ, లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేకత పూజలు చేయించి ఆలయ కమిటీ చైర్మన్ దేవర సమతవెంకటరెడ్డి, ఎమ్మెల్యేను సన్మానించారు.
అనంతరం పోతురాజుల వేషధారణలో ఆటపాటలతో బోనాలను ఊరేగించారు.
ప్రజలు బోనం ఎత్తుకొని గ్రామ దేవత పోచమ్మకు ఆదివారం రోజున చేవెళ్ల లో వివిధ కాలనీలలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు ఆలయానికి తరలివెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా ప్రకటించిందని చెప్పారు.
ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు అంటేనే ప్రాంతాలలో ఎంతో సందడి నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతిని వివిధ పార్టీల నాయకులు వివిధ గ్రామాల భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు