నేటి సాక్షి ప్రతినిధి శంకర్పల్లి
శంకర్పల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మోకిల గ్రామానికి చెందిన మన్నె వెంకటేష్ ముదిరాజ్ నియమితులైనారు. ఈ సందర్భంగా ఆదివారం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటయ్య సమక్షంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నివాసంలో ఆయన చేతుల మీదుగా వెంకటేష్ ముదిరాజ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. మండల ఉపాధ్యక్షుడిగా వడ్ల నర్సింహాచారి, మండల ప్రధాన కార్యదర్శిగా మంగలి సంపత్ కుమార్ లను నియమించారు. అనంతరం నూతన మండల అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ సంఘానికి శంకర్పల్లి మండలానికి ఒక గొప్ప ఘనత అని పేర్కొన్నారు.
ఇలాంటి నూతన నాయకత్వంతో బీసీ వర్గ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని కితాబు ఇచ్చారు. మండల అధ్యక్షుడిగా నియమించినందుకు మండల బీసీ సంఘం నాయకులకు, సభ్యులకు వెంకటేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్ కృష్ణయ్య నూతన అధ్యక్షుడికి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.