– డ్రగ్స్ ఇన్ స్పెక్టర్‌కు హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్ ఫిర్యాదు
నేటి సాక్షి, కరీంనగర్: కాలం చెల్లిన మందులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరీనంగర్పట్టణంలో ఇందిరానగర్‌లో ఉన్న రెనే హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్డ్రగ్స్ఇన్స్పెక్టర్కు గురువారం హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సతీష్మాట్లాడుతూ ఇటీవల ఒక మహిళకు అనారోగ్యంతో హాస్పిటల్లో హెల్త్ చెకప్ కోసం వచ్చిందని, డాక్టర్ పరిశీలించి మందులు రాయగా, మందులు తీసుకోవడానికి ఆస్పత్రిలోని మందుల షాపునకు వెళి మందులు తీసుకుందన్నారు. అందులో ఒక షీట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినా దానిని రోగికి ఇచ్చారన్నారు. ఈ విధంగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి లైసెన్సు రద్దు చేయాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను కోరినట్టు సతీష్తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో కమిటీ సభ్యులు, జిల్లా సెక్రెటరీ వేముల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

