- – ఉత్సవాలను ప్రారంభించిన నరేందర్రెడ్డి

నేటి సాక్షి, కరీంనగర్: శ్రావణమాసం ప్రారంభోత్సవం సందర్భంగా కరీంనగర్లోని కొత్తపల్లిలో ఉన్న అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ‘శ్రావణ మహోత్సవ్’ కార్యక్రమానికి వైభవంగా నిర్వహించారు. దీనికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హాజరై, కార్యక్రమాన్ంని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రావణమాసం అనగానే పండుగ వాతావరణం వ్యాపిస్తుందని, ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారని చెప్పారు. శ్రావణమాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసమని, ఈ మాసంలో అనేక రకాలైన పూజలు నిర్వహిస్తారని, ముఖ్యంగా మహిళలు సౌభాగ్యం కోసం అనేక వ్రతాలు చేస్తారన్నారు. ఈ మాసంలోనే నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి వేడుకలను చాలా శోభాయమానంగా నిర్వహిస్తారని చెప్పారు. మహిళలు ప్రతి శుక్రవారం గౌరీ మాత వ్రతాన్ని ఆచారిస్తారన్నారు. ఈ సందర్భంగా భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
