తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు
నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)
బడి ఈడు పిల్లలను బడిలోకి పంపాలని ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం దుండివారిపాలెం అక్కిరాజు దిబ్బలోని ఎస్టీ కాలనీ కుటుంబాల వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో వాళ్ళ జీవితాలు వెలుగులు వస్తాయని ఇందు కొరకు ప్రతి ఒక్కరిని విద్య నేర్చుకునేందుకు బడికి పంపించే బాధ్యత మీదేనని తల్లిదండ్రులకు సూచించారు. ఆ విద్యార్థులకు తీర్చి తీర్చిదిద్దడం బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసుకుంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి విజయశ్రీ, ఎసై రవీంద్ర,కార్యదర్శి వీరాస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

