మానకొండూరు ఎమ్మెల్యేకు మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ గౌడ్ వినతిపత్రం సమర్పణనేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళగ్రామంలోని వాగులో బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు వాగు వద్ద పూల బతుకమ్మలు ఆడుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకోసం శాశ్వతంగా ఘాటు మరియు మెట్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలంటూ మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు.వినతి పత్రం అందజేసిన వారిలో కెడిక కిష్టారెడ్డి, బోయినీ ప్రశాంత్, తదితరులు ఉన్నారు.





