నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, గుగ్గిళ్ల గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం వడ్ల కొనుగోలు కేంద్రాలను మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్లను నేరుగా రైతుల నుండి సరైన ధరకే కొనుగోలు చేయడం ద్వారా మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్,మండల పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,గూడెల్లి శ్రీకాంత్, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి,సంపత్, బైర సంతోష్, ఎర్రల రాజు, సందీప్, ప్రశాంత్,ఐకెపి సిబ్బంది,మహిళలు, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





