నేటి సాక్షి, ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపుగా ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మను ప్రజలు, యువత శ్రమదానం చేసి తొలగించారు. చెట్లు వేపుగా పెరిగడంతో పది రోజులుగా కుమ్మరి కుంట వయా కొత్తూర్, న్యూ కొత్తపల్లి, చామనపల్లి గ్రామాల మీదుగా ధర్మారం మోడల్ స్కూల్ కి వెళ్లే ఆర్టీసీ బస్సు రావడం నిలిపివేయడంతో స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రెండు రోజులుగా చామనపల్లి, న్యూ కొత్తపల్లి గ్రామాల ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను, చెట్ల కొమ్మలను శ్రమదానం చేసి తొలగించారు. దీంతో పాటు కొత్తూరు నుండి చామనపల్లి మీదుగా కటికనపల్లి వరకు ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. కటికనపల్లి మాజీ ఉపసర్పంచ్ రామడుగు గంగారెడ్డి పెద్ద చెట్ల కొమ్మలను తొలిగించేందుకు తన సొంత జెసిబి ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.





