Thursday, March 12, 2026

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 12, నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో సమాచార హక్కు చట్టం -2005 , 20వ వార్షికోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు పంతిగి చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ పాల్గొని, మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం -2005 ,అక్టోబర్ 12న అమలు లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నము. రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పినప్పటికీ కూడా వివిధ జిల్లాలో నిర్లక్ష్యం చేస్తూ,ఆర్టీఐ గురించి అవగాహన కల్పించలేకపోతున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించకుండా, అవినీతిని నిర్మూలించకుండా పోయిందని అన్నారు. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ లక్ష్మీనారాయణ,జిల్లా ఇంచార్జీ ఎడ్ల కుర్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా సభ్యులు గజలప్ప, జిల్లా సలహాదారు జిందప్ప,నారాయణపేట అసెంబ్లీ ఇంచార్జీ గణేష్, అసెంబ్లీ సభ్యులు సంధ కృష్ణ, మాణిక్యాల రమేష్, మండల అధ్యక్షులు వెంకటయ్య, బ్రహ్మయ్య,మురళి, రాము,రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News