Thursday, March 12, 2026

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను తక్షణమే తొలగించాలి

నేటి సాక్షి, కోరుట్ల టౌన్*(గణేష్ గొల్లపల్లి)పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను ఉద్యోగం నుండి తొలగించి, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ అంబేద్కర్ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అడ్డుకోవడం, కుల వివక్ష చూపడాన్ని వారు తీవ్రంగా ఖండించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ప్రపంచ దేశాలే గౌరవిస్తుంటే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని దళిత సంఘాలు జిల్లా కలెక్టర్ ను కలిస్తే చులకనగా మాట్లాడారని అన్నారు. సుల్తానాబాద్ మండలం లోని ఓ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. జిల్లా కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన దళితుల పట్ల కూడా ఆయన కుల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి ,వర్ధంతి వేడుకలను ప్రభుత్వపరంగా నిర్వహిస్తుంటే పెద్ద పల్లి లో మాత్రం అందుకు భిన్నంగా పూలదండ వేసి చేసుకోవాలని అనడం ఆయన అంబేద్కర్ ను అవమానించడమేనని తెలిపారు. ఆయనపై ప్రభుత్వం విచారణ చేసి కలెక్టర్ ఉద్యోగం నుండి తొలగించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు బలిజ రాజారెడ్డి, ఉయ్యాల నరసయ్య , తాజా మాజీ కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మీనారాయణ ,బద్ది మురళీధర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇంద్రాల హరీష్, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, బన్న రాజేష్, పొట్ట లక్ష్మణ్, గురు మంతుల సత్తయ్య, సామల వేణుగోపాల్, కండ్లే మైకల్, దామ కొండయ్య, ఉయ్యాల శేఖర్, సిరికొండ రాములు, కండ్లే గంగాధర్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News