అభినందనలు తెలిపిన టిఆర్టిఎఫ్(TRTF) రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ….నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్)తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ కుమార్తె కుమారి బుర్ర భువన గ్రూప్ 2 కు ఎంపికై, కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ గా నియమితులు కాబోతున్న సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కటకం రమేష్ రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ సుంకి శీల ప్రభాకర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన్నగారి నారాయణ, టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యవర్గం కుమారి బుర్ర భువన ను ఆత్మీయ సత్కారం చేసి, అభినందించి, ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కటకం రమేష్ మాట్లాడుతూ..కుమారి బుర్ర భువన ఒకటి కాదు. రెండు కాదు, ముచ్చటగా మూడు ఉద్యోగాలు గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, లకు ఎంపిక కావడం గర్వకారణం అన్నారు.నిజంగా కుమారి భువన కు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులు మరియు అభినందనీయులనీ అన్నారు. ఇదే స్ఫూర్తి, పట్టుదలను కొనసాగిస్తూ కుమారి బుర్ర భువన సివిల్ సర్వీసెస్ సాధించాలని ఆశీర్వదించారు. యువత చెడు దారి పట్టకుండా చిన్ననాటి నుండే మంచి లక్ష్యాలను, ఎంచుకొని, ఉన్నతమైన ఉన్నతమైన గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకూడదన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్ రావు, టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతుగంటి రమేష్, కోల వినయ్ కుమార్, గాజేంగి విష్ణు, మామిడాల రమేష్, సుల్తాన్ రాజు, గోలి రాధకిషన్, గుగులోత్ రమేష్ నాయక్, బూట్ల శ్రీనివాస్, పులి ప్రవీణ్ కుమార్, పేరుక వెంకటేశ్వరరావు, సామల రాములు, ఇప్పకాయల ప్రకాష్, లక్కే లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.





