జగిత్యాల జిల్లాలో చోరీ.. 7 తులాల బంగారం , 10 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2లక్షల 70 వేల నగదు, ఒక బైకు మాయం….*జగిత్యాల (నేటి సాక్షి) (పూరెళ్ల బాపు) (అక్టోబర్ 13):జగిత్యాల అర్బన్ గ్రామం ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఐదు ఇండ్లలో చొరబడి సుమారు 7 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2లక్షల 70 వేల నగదు, ఒక బైకును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





