Thursday, March 12, 2026

రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి రుద్రంగి మండల పరిధిలో వరి ధాన్యం, కొనుగోళ్లు ప్రారంభం..- ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,మానాల మోహన్ రెడ్డి సహకారంతో సమస్యలు వెంటవెంటనే పరిష్కరిస్తాం..నేటిసాక్షి ప్రతినిధి రుద్రంగి :రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యం, ఎక్కువ ధర ఇస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి అన్నారు. మానాల రైతు వేదిక వద్ద ఫ్యాక్స్ చైర్మన్ ఏలేటి చిన్న రెడ్డి తో కలిసి రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి ఫ్యాక్సిజన్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కౌలు రైతులకు భరోసా వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని , రైతులకు ఇబ్బంది కలగకుండా నేటి నుండే కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామని, రైతులు వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు కల్లాల వద్దనే ధాన్యాన్ని ఎండబెట్టుకొని తేమ శాతం 17 దాటకుండా చూసుకోవాలని, ధాన్యం కొనుగోలులో తూనికల తారుమారు, రేట్ల విషయంలో అవకతవకలు జరుగుతే వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువస్తే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానాల మోహన్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు. గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలు, ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల తిరుపతి, మానాల ఫాక్స్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుం జలపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొమ్ముల రవీందర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్లు జక్కు లింగన్న, జూల భూమన్న, బానోత్ గంగాధర్, మాజీ వైస్ చైర్మన్స పిసరి భూమన్న, నాయకులు జక్కు మోహన్, జక్కు వంశీ, జక్కుల లక్ష్మీనారాయణ, ఇప్ప మహేష్, నారాయణ గౌడ్, తూమ్ రవీందర్, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News