Thursday, March 12, 2026

రామంతపూర్ హోమియోపతి వైద్య కళాశాలలో హోమియోపతి ఎక్స్పో పాత్రికేయుల సమావేశంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ యన్ లింగరాజు

నేటి సాక్షి ఉప్పల్ అక్టోబర్ 13హైదరాబాద్ రామాంతపూర్ లోని జె.ఎస్.పి.ఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ నెల 17, 18వ తేదీన హోమియోపతి ఎక్స్పో-2025 కార్యక్రమం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ లింగరాజు పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లింగరాజు మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంబీబీఎస్ వైపే కాదు అంతకంటే అద్భుతంగా హోమియోపతి వైద్యం ఉంటుందని ఈ నెల 17, 18న జరిగే హోమియోపతి ఎక్స్పో లో హోమియోపతి వల్ల ఎన్నో వ్యాధులకు ఉన్న అద్భుతమైన చికిత్స విషయాలు, హోమియోపతి వైద్యం అభ్యసించడం వలన ఉపయోగాలు ప్రజలకు, 9వ, 10వ తరగతి విద్యార్ధులు, ఇంటర్మీడియట్ విద్యార్ధులకు తెలియచేయుటకు ఈ హోమియోపతి ఎక్స్పో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వహించడం జరుగుతుందని తప్పకుండా ప్రజలు, విద్యార్ధులు ఈనెల 17, 18న జరిగే హోమియోపతి ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొని హోమియోపతి వలన కలిగే లాభాలను, ఇక్కడ అందిస్తున్న వైద్య విషయాలను, ఇక్కడ జరుగుతున్న పరిశోధనలను తెలుసుకోవాలని ప్రినిపాల్ లింగరాజు తెలియచేశారు ఈ సమావేశంలో డాక్టర్ ఎం లింగరాజు ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఈ కృష్ణమూర్తి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పార్థసారథి ప్రోగ్రాం ఇన్చార్జ్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News