నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 13, నారాయణపేట జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన ఎస్పీ కి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ కు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శాఖ పరమైన వివిధ అంశాల పై వారు చర్చించారు.





