నేటి సాక్షి, బెజ్జంకి:మానసిక, భౌతిక ఒత్తిడులను ఎదుర్కోగల సత్తా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే ఉందని గాగిల్లాపూర్ మాజీ సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన స్వయంగా 13 వేల రూపాయల వ్యయంతో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి కృషి చేస్తే తప్పకుండా ఎదగగలరని ఆయన సూచించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొమిరే మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, సర్కారు పాఠశాలల్లో విద్యతో పాటు విలువల బోధన కూడా జరుగుతుంది. ఈ పాఠశాలలు గ్రామీణ అభివృద్ధికి పునాది వేస్తాయని అన్నారు.గ్రామీణ పాఠశాలల్లో ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు జరగడం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ప్రధానోపాధ్యాయుడు పవన్ సింగ్ తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. పవన్ సింగ్, ఉపాధ్యాయులు సంపత్ యాదవ్, మహేందర్, ధర్మయ్య, నాగమణి, నరేష్, గ్రామస్తులు అన్నాడి తిరుపతి రెడ్డి, తూముల తిరుపతి, గూడూరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.





