నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 13,ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర టి ఆర్ఎస్ఎంఏ (ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డులను హైదరాబాద్ పంజాగుట్ట ఆడిటోరియం లో అందించారు. నారాయణపేట జిల్లా నుంచి కృష్ణగోకులం స్కూల్ కరస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి తో పాటు శ్రీహంసవాహిని స్కూల్ కరస్పాండెంట్ రాజేష్ కుమార్ లు ఎంపికయ్యారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఉన్నత మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించి, బొకే, జ్ఞాపిక అందజేశారు. కార్పొరేట్ పాఠశాలల కంటే బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ లో చక్కటి బోధన జరుగుతుందని, చదువుతోపాటు క్రమశిక్షణ, మానవత విలువలు అందిస్తున్నారని గుర్తు చేశారు. నేటి కాలంలో విద్యను పొందే విద్యార్థులు వారి జీవితంలో స్థిరపడే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ ఎం ఎ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి జయసింహ గౌడ్, గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు.




