Thursday, March 12, 2026

తోటపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు- ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించి అక్రమ డంపులు గుర్తిస్తున్న బెజ్జంకి పోలీసులు

నేటి సాక్షి, బెజ్జంకి:మండలంలోని తోటపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్‌ చేస్తూ, ప్రతి గల్లీ లో, పరిశీలిస్తూ, అనుమానాస్పద ప్రదేశాలలో ఉన్న అక్రమ ఇసుక నిల్వలను గుర్తిస్తున్నారు.బెజ్జంకి ఎస్సై బి. సౌజన్య నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రదేశాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని, వాటిని తరలించడానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కి తరలించే చర్యలు కూడా ప్రారంభించామని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా గావించేవారిని ఉపేక్షించేది లేదని,ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులు ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్సై కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News