మహేశ్వరం నియోజకవర్గం కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ**(నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 14:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల పరిధిలో పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం విప్రో సంస్థ సహకారంతో హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు మహేశ్వరం నియోజకవర్గం ఐ.ఎన్.టి.యు.సి కార్మిక శాఖ అధ్యక్షులు నడికుడ శివ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన విప్రో కంపెనీ ప్రోగ్రాం మేనేజర్ అర్చన ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించేందుకు విప్రో వంటి సంస్థలు ముందుకు రావడం సమాజానికి ఆదర్శమని అన్నారు.దీనికి ప్రోగ్రాం మేనేజర్ అర్చన సానుకూలంగా స్పందిస్తూ,త్వరలోనే మండలంలోని ఎంపికైన గ్రామాల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించే ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు.





