పాములపాడు అక్టోబర్ 14 నేటి సాక్షి :- పాములపాడు మండలంలోని, వాడాల గ్రామంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న శిలా రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఆయన పార్థివ దేహానికి నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రభుత్వ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్-కురువ.రమేష్, టిడిపి మండల సీనియర్ నాయకుడు కురువ.ఎల్లయ్య, తదితర నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వాడాల గ్రామానికి చెందిన చిన్న శిలా రెడ్డి తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి ఇప్పటిదాకా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.





