జగిత్యాల టౌన్ (నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)…..(అక్టోబర్ 14):జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణం లో అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గారు.జగిత్యాల పట్టణం వివిధ వార్డులలో TUFIDC , జనరల్ ఫండ్ తో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ పనులు వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి అట్టి పనులు రేపటి నుండి యదావిధిగా ప్రారంభించాలి.ప్రజలకు అత్యవసరం ఉన్న చోట పనులు త్వరిత గతిన ప్రారంభించాలీ.పలు సమస్యలు,వివిధ కారణాలతో నిలిచిపోయిన కొన్ని పనులు వేరే వార్డులకు,వార్డులో ఇతర ప్రాంతాలకు మార్చాలని అన్నారు.నాణ్యతతో పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని,పూర్తి అయిన పనులకు త్వరిత గతిన బిల్లులు చెల్లించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్,DE లు ఆనంద్ వరుణ్ AE లు శరన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.





