నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)రామచంద్రాపురం మండలం కొత్త కండ్రిగ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ మాజీ కన్వీనర్ సురేంద్ర నాయుడు సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి గారు ,దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి , చిట్టిబాబు నాయుడు , మిట్ట కండ్రిగ లోకనాథరెడ్డి, ఢిల్లీ రెడ్డి, బాదురు చంగల్రాయిరెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఆది రెడ్డి మరియు సెంథిల్ కుమార్ వంటి ప్రముఖులు కొత్త కండ్రిగ గ్రామానికి వెళ్లి సురేంద్ర నాయుడు భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుమారుడు వంశీని ఓదార్చుతూ తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.





