నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 14,నారాయణపేటజిల్లా నూతన ఎస్పీ *డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారిని మంగళవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆకుల బాలప్ప, మేనుశ్రీ, ప్రభాకర్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ శాఖ మరియు న్యాయ వ్యవస్థ మధ్య సత్సంబంధాలు కొనసాగి, కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంలో సమన్వయం కీలకమని, కేసులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని ఎస్పీ తెలిపారు. న్యాయ వ్యవస్థలో పీపీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వారితో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.




