Thursday, March 12, 2026

మరికల్ లో పర్యటించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో సమావేశం

నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 14,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళ వారం పర్యటించి మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మరికల్ మండల కాంప్లెక్ లో జరిగిన పంచాయతీ కార్యదర్శులతో మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పై సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో మండలం వెనకబడి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రేండింగ్ పూర్తయిన ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారభించాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాలలో మండల పనితీరు మెరుగు పర్చేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం కలెక్టర్ మండలంలోని తీలేరు గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగిరం చేయించాలని అధికారులకు సూచించారు. దశల వారీగా ఇండ్ల బిల్లుల చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే లబ్ది దారుల ఆధార్ అప్ డేట్ లేనందున కొందరికి డబ్బులు చెలించడం ఆలస్యం అవుతున్నాయని తెలపగా ఆధార్ అప్ డేట్ లబ్ధిదారులను బ్యాంక్ కు తీసుకెళ్లి ఎం పీ సి ఎస్ ఫార్మ్ అందజేయాలనీ హౌజింగ్ పీడీ శంకర్ కు ఆమె సూచించారు.గ్రామంలో పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహించరాదని,పంచాయతీ సెక్రటరీలు ఉదయం 8 గంటల లోపు విధులకు హాజరైనప్పుడే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ప్రతి పంచాయతీ సెక్రటరీ సమయపాలన పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశుద్ధ కార్యక్రమాల పై నిర్లక్ష్యం చేసిన కార్యదర్శులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులకు తమ తమ గ్రామాల పై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర అని చెప్పారు. మండల కాంప్లెక్స్ లో మొక్కలు నాటకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్నాయని ఇప్పుడే మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ సెంటర్ లో పని చేస్తున్న మొత్తం సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత నెల జరిగిన ప్రసవాల వివరాలు, ఈ డీ డీ నమోదు ను పరిశీలించారు. ప్రభుత్వ దవాఖానాలలోనే ప్రసవాలు చేసుకునే విధంగా గర్భిణీలకు అవగాహన కల్పించాలని తెలిపారు. శ్యామ్ మ్యామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారని? పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేందుకు వెళ్తున్నారా? లేదా? అని ఏ ఎన్ ఎం లను ప్రశ్నించారు. భారత్ మాల పై ఆరా….భారత్ మాలలో భాగంగా మరికల్ కు సంబంధించి ఎంత మంది భూములను కోల్పోతున్నారని, వాటి వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. భూములు కోల్పోయిన వారిలో ఎంతమంది ద్వారా అక్విటెన్స్ తీసుకున్నారని తహసీల్దార్ ను ప్రశ్నించగా, ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపిన తహసిల్దార్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అత్యవసరం పరిస్థితులలోనే సిబ్బందికి సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. భూభారతి లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎన్ని క్లియర్ చేశారు ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ? అని పెండింగ్ దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ పరిధిలో ఉన్నవాటిని వెంటనే క్లియర్ చేసి పంపాలాన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News