నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 14,ఏబుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరగిద్ద రెండవ రోజు ఈ శిక్షణ ఉద్దేశించి స్టేట్ రిసోర్స్ పర్సన్ శంకర్ సంగం మాట్లాడుతూ నూతనంగా ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ ప్రవేశపెట్టడం జరిగిందని సంగంఈ శిక్షణలో ఉపాధ్యాయులు కోడింగ్ డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్ థింకింగ్ డిజిటల్ సిటిజెన్షిప్ అనే అంశాలపై శిక్షణ ఉంటుందని ఇక్కడ నేర్చినటువంటి అంశాలను విద్యార్థులకు బోధించినచో విద్యార్థులకు ఉపయోగపడుతుందని విద్యార్థులకు 21 సెంచరీలో స్కిల్స్ రావాలని ఇక్కడ నేర్చినటువంటి అంశాలను విద్యార్థులకు బోధించి విద్యార్థులలో జీవనోపాధికి ఉపాయం పడే నైపుణ్యాలను విద్యార్థులకు రావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష జిల్లా సైన్స్ అధికారి హెచ్ భాను ప్రకాష్ మరియు రిసోర్స్ పర్సన్ అమృత్ తిప్పన నయుం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.





