నేటి సాక్షి, బెజ్జంకి:ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ బెజ్జంకి లోని శ్రీనిజా ఇండేన్ కార్యాలయంలో ప్రారంభమైంది. అర్హులైన కుటుంబాల మహిళలు అవసరమైన పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.దరఖాస్తు కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు (రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి), బ్యాంక్ ఖాతా జిరాక్స్, 4 కలర్ ఫోటోలు సమర్పించాలి. అదనంగా, ఎస్.సి., ఎస్.టి. వర్గాలకు చెందినవారు కుల ధ్రువీకరణ పత్రాన్ని జిరాక్స్ రూపంలో జతపరచాలి.కుటుంబ మహిళ యజమానురాలు స్వయంగా ఆఫీస్‌కి హాజరై ఆధార్ కేవైసీ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ మరియు సబ్సిడీ సదుపాయాలు లభిస్తాయని శ్రీనిజా ఇండేన్ ప్రతినిధి తెలిపారు. అర్హులైన కుటుంబాలు త్వరితగతిన దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకం ప్రయోజనం పొందాలని, దరఖాస్తుల స్వీకరణ కార్యాలయంలో నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. సంప్రదించవలసిన చిరునామా:శ్రీనిజ ఇండియన్ గ్యాస్ బెజ్జంకి ఫోన్: 89770 50938.




