( నేటి సాక్షి సాక్షి):రోడ్లపై తోపుడు బండ్లను పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించరాదని చేవెళ్ల ట్రాఫిక్ ఏఎస్ఐ ఎస్ చందర్ అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి రైల్వే స్టేషన్ రోడ్డులో ఫుట్ పాతులపై పెట్టే పండ్ల, కూరగాయల, పూల దుకాణాలకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ లు వేసి, రోడ్లపై పెట్టరాదని సూచించారు. ఈ సందర్భంగా ఎఎస్ఐ మాట్లాడుతూ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. చిన్నపాటి వ్యాపారస్తులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఏ ఎస్ ఐ కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది శ్రీశైలం, శ్రీనివాస్ ఉన్నారు.




