(నేటి సాక్షి)(పూరెళ్ల బాపు)(అక్టోబర్ 15):జగిత్యాల జిల్లా కు చెందిన అభ్యర్థులు ఇటీవల వెలువడిన గ్రూప్ -1 ఫలితాల్లో డిఎస్పి (Deputy Superintendent of Police) హోదాకు ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతిభ లు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు వారిని శాలువాతో సన్మానించి అభినందించారు.*పోలీస్ సేవ ఒక మహాత్తారమైన బాధ్యత* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ — “పోలీస్ సేవ ఒక మహత్తరమైన బాధ్యత అని ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయమని” పేర్కొన్నారు. విధి నిర్వాహణలో నిష్పక్షపాతoగా ఉంటూ క్రమశిక్షణ తో , సేవాభావం తో ప్రజల కు సేవ చేస్తూ పోలీస్ శాఖ కు మంచి పేరు తీసుకొని రావాలని సూచించారు. విధుల్లో అత్యుత్తమంగా రాణించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్ గారు ,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ , మరియు వారి కుటుంబ సబ్యులు పాల్గొన్నారు.




